వ‌శిష్టాదేవి (శ్రియా) విజయతిలకం దిద్దింది. ఇక, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ యుద్ధ భూమిలోకి దిగడమే తరువాయి. బాలకృష్ణ – శ్రియా జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా... చ‌రిత్ర‌కు బొట్టు పెట్టిన శ్రియా

Gautamiputra Satakarni Back To Back Release Teasers
వ‌శిష్టాదేవి (శ్రియా) విజయతిలకం దిద్దింది. ఇక, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ యుద్ధ భూమిలోకి దిగడమే తరువాయి. బాలకృష్ణ – శ్రియా జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజింగ్ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. “బాలయ్యకు బొట్టు పెడుతూ.. ‘నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు.. ఓ చరిత్రకు’ అంటూ శ్రియ చెప్పిన డైలాగ్ సూపర్భ్ గా ఉంది. ఆ తర్వాతే బాలకృష్ణ యుద్దానికి సిద్ధమవుతున్న సీన్ ని చూపించారు. టీజర్ సినిమాపై అంచనాలని పెంచేలా ఉంది.

తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. శాతకర్ణి లెటెస్ట్ టీజర్ పై మీరు ఓ లుక్కేయండీ.. !

లేటెస్ట్ గాసిప్స్