ప్రివ్యూ : గౌతమిపుత్ర శాతకర్ణి

Gautamiputra Satakarni Back To Back Release Teasers
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య వీరత్వం చూపించబోతున్నాడు. ఆయన భార్య వ‌శిష్టాదేవిగా శ్రియా కనిపించబోతోంది. శాతకర్ణి తల్లి గౌతమిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది.

‘ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు’. చిన్నప్పుడే ఈ విషయాన్ని గ్రహించిన శాతకర్ణి.. 33 గణ రాజ్యాలుగా ఉన్న భారతాన్ని ఏకం చేశాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్స్, టీజర్స్ లో బాలయ్య వీరత్వం, పాత్రల గొప్పదనం స్పష్టంగా కనిపించింది. దీంతో.. గొప్ప తెలుగు చక్రవర్తిగా బాలయ్య వీరత్వాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీనికితోడు మన నేలని.. యావత్ దేశాన్ని తెలుగు నేల నుంచి పరిపాలించిన గొప్ప తెలుగు చక్రవర్తి చరిత్రని తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. తెలుగు ప్రజలకి సరిగ్గా మన తెలుగు నేల అమరావతి చరిత్రని చెబుతానని దర్శకుడు పలుమార్లు స్పష్టం చేయడం కూడా సినిమాపై ఆసక్తి పెంచింది. సామాజిక, చరిత్రాత్మక అంశాలపై దర్శకుడు క్రిష్ కి మంచి పట్టుందన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన దర్శకుడిగా క్రిష్ ఎదుగుతున్నారు.

భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా మరికొద్దిసేపట్లో ప్రేక్షకుల ముందుకురానున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మరిన్ని విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ :

* చారిత్రాత్మక చిత్రాలంటే ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది.

* ఓ చారిత్రాత్మక చిత్రానికి ఓ స్టార్ హీరో తోడైతే.. ఏర్పడే క్రేజ్ అంతా ఇంతా కాదు.

* శాతకర్ణి విషయంలోనూ అదే జరిగింది.

* నందమూరి బాలకృష్ణ తన ప్రతిష్టాత్మక చిత్రం 100వ చిత్రంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని ఎంపిక చేసుకోవడంలోనే 90% సక్సెస్ అయ్యారు.

* అది కూడా ఓ తెలుగు నేలని పరిపాలించిన గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి కావడం మరింత కలిసొచ్చింది

* ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ లో బాలయ్య వీరత్వం కనిపించింది. ఇక, సినిమాలో బాలయ్య వీరత్వం పీక్స్ చేరడం ఖాయం
* దర్శకుడు క్రిష్ గురించి ఎంత చెప్పిన తక్కువే.

* ఇప్పటి టాలీవుడ్ లో వరకు కేవలం కథని మాత్రమే నమ్మి సినిమాలు చేస్తున్న అతి తక్కువ మంది దర్శకుల్లో క్రిష్ ఒకరు

* కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా కథని నమ్మే దర్శకుడు

* ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్స్ లో బాలకృష్ణ, శ్రియా, హేమ మాలిని పాత్రలు మాత్రమే హైలైట్ గా కనిపించాయి.

* సినిమాలు మరికొన్ని పాత్రలు కనువిందు చేయనున్నాయి.

* గౌతమిపుత్ర శాతకర్ణిలో యుద్ద సన్నివేశాలు హైలైట్ కానున్నాయని చెబుతున్నారు.

* దీనికి గౌతమిపుత్ర శాతకర్ణి కథ తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయితే బాలయ్య వందో చిత్రం ఓ మధుర జ్ఝాపకంగా మిగిలిపోవడం ఖాయం.

ఇలా.. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరికొద్ది సేపటిలో పూర్తి రివ్యూనే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్. అప్పటి వరకు క్లిక్ చేస్తూనే ఉండండి మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.