బాలీవుడ్‌ నటి గీతాకపూర్‌ ఇకలేరు

అలనాటి బాలీవుడ్‌ నటి గీతాకపూర్‌ కన్నుమూశారు. ఈ ఉదయం ముంబైలోని ఎస్‌ఆర్‌వీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నిర్మాత అశోక్ పండిత్ మీడియాకు తెలిపారు.

“గీత కన్నుమూశారు. ఆమెను కాపాడుకోవడానికి మా శాయశక్తులా ప్రయత్నించాం. చివరికి మా చేయి దాటిపోయారు. ఆమె ఏడాదిగా తన పిల్లల్ని కలవాలని, చూడాలని ఎదురుచూస్తున్నారు, కానీ, ఎవరూ రాలేదు. గత శనివారం ఆమె కోసం ఘనంగా విందు ఏర్పాటు చేశాం. ఆమె కూడా బాగానే ఉన్నారు. అదే సంతోషం ఆమె మనసులో లేదు. చివరిసారి పిల్లల్ని చూడాలని తపించారు. ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె మరణించారు” అని తెలిపారు. ‘పాకీజా’ సినిమా గీతాకపూర్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె రాజ్‌కుమార్ రెండో భార్య పాత్రలో కనిపించారు.