మా ఆయన బంగారం

Geetha-Madhuri

‘మా ఆయన బంగారం’ అంటోంది తెలుగు సినీ గాయని గీతా మాధురి. ఆమె నటుడు నందుని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే, ఆ మధ్య నందుపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు, సిట్ విచారణపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. డ్రగ్స్ కేసులో నందు పేరు వినిపించినప్పుడు ఎలా ఫీలయ్యారు ? అని అడిగితే.. నందుపై తనకి పూర్తి నమ్మకం ఉంది. దీంతో ఎలాంటి భయం అనిపించలేదు. నిప్పులేకపోయినా పొగ వస్తుందనే విషయం ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి తనకి అర్థమైందని తెలిపింది.

ప్రస్తుతం నందు చిన్న చిన్న సినిమాల్లో హీరోగా, పెద్ద సినిమాల్లో చిన్న పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఆయనలో దర్శకత్వ ప్రతిభ ఉంది. నటుడిగా నిరూపించుకొంటూనే.. దర్శకుడుగా ట్రై చేయాలని కోరుకొంటున్నా. గతంలో నందు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్టయ్యింది. అప్పటి నుంచి తనలో దర్శకుడు అయ్యే ప్రతిభ ఉందని గుర్తించా. ఎప్పటికైనా ఆయన దర్శకుడు అవుతాడని అనుకొంటునన్ని చెప్పుకొచ్చింది.