ఆ దర్శకుడుని తేజు ప్రక్కన పెట్టలేదట

రొటీన్ మాస్-యాక్షన్ చిత్రాలు చేసి మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు అలసిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త దారిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు షురు చేశారు. ఇందులో భాగంగానే ‘తేజ్ ఐ లవ్ యు’ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఐతే, అది సక్సెస్ ని ఇవ్వలేదు. అయినా.. తన ప్రయత్నాలని కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. కొత్త దర్శకుడుతో ‘భగవద్గీత సాక్షిగా’ టైటిల్ తో ఓ క్రైమ్ థ్రిల్లర్ ని చేయడానికి రెడీ అవుతున్నాడు.

అంతకంటే ముందు గోపీచంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. వీరి కలయికలో విన్నర్ సినిమా వచ్చింది. ప్రేక్షకుల ని పెద్దగా మెప్పించలేకపోయింది. అయినా.. వీరి కాంబోలో మరో సినిమా రానుందనే ప్రచారం జరిగింది. ఇంతలో తేజు కిషోర్ తిరుమల సినిమాతో పాటు,కొత్త దర్శకుడికి ఓకే చెప్పడంతో గోపీచంద్ మలినేనిని ప్రక్కన పెట్టేసినట్టేననే ప్రచారం జరుగుతోంది.

తాజాగా, ఈ ప్రచారంపై విన్నర్ దర్శకుడు స్పందించారు. ‘సాయిధరమ్ తేజ్ తో నా సినిమా ఉండదన్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. సాయిధరమ్ తేజ్ తో నా సినిమా వుంది. అందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తా’నని క్లారిటీ ఇచ్చారు.