నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చారిత్రాత్మక చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా... ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ నివిడి ఎంతో తెలుసా ?

balayya-8
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చారిత్రాత్మక చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

తెలుగు జాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రప్రంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన
చిత్రమిది. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ లో, అతి తక్కువ టైం, ఇంత కాస్లీగా తెరకెక్కించడంపై దర్శకుడు క్రిష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చారిత్రాత్మక కథ చెబుతున్నప్పుడు నివిడి పెరిగే ఛాన్స్ ఉంది. అది ఒక్కోసారి ప్రేక్షకుడు బోర్ గా ఫీలయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. శాతకర్ణి నివిడి 2గం॥ల 12ని॥లు మాత్రమే అనే ప్రచారం జరిగింది.

ఇది నిజమేనట. ఓ చారిత్రాత్మక చిత్రానికి ఇంత తక్కువ నివిడితో చూపించడం క్రిష్ కి మాత్రమే దక్కిందని చెబుతున్నారు. ఎక్కడ కూడా ఒక్క వేస్ట్ సీన్ లేకుండా.. పక్కాగా ప్లాన్ చేసుకొన్నాడట క్రిష్. దాని ఫలితంగానే నివిడిని తగ్గించగలిగారని చెబుతున్నారు. మరీ.. అంత తక్కువ టైం.. అంత పెద్ద తెలుగు చక్రవర్తి జీవిత గాధ ఎంత ఆసక్తిగా చెప్పారన్నది చూడాలి.

లేటెస్ట్ గాసిప్స్