అప్పుడే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాని చూసేసిన బాలయ్య ఫ్యామిలీ

gouthami
నందమూరి బాలకృష్ణ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలతోనే హిట్స్ కొట్టేవారు. వారికి భిన్నంగా బాలయ్య చారిత్రాత్మక చిత్రంతో రంగంలోకి దిగబోతున్నాడు. రేపే (గురువారం) ముహూర్తం. శాతకర్ణి సూపర్ హిట్ అయితే, ఇకపై బడా హీరోలు కూడా కమర్షియల్ చిత్రాలకి బదులుగా చారిత్రాత్మాక చిత్రాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

అయితే, ఇప్పటికే ప్రీ-రిలీజ్ షోలు చూసిన వారి నుంచి ‘గౌతామీ పుత్ర శాతకర్ణి’ బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ వస్తోంది. ఇప్పటికే బాలయ్య ఫ్యామిలీ కూడా శాతకర్ణిని వీక్షించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి బాలయ్య ఫ్యామిలీ కోసం రామనాయుడు స్టూడియో లో స్పెషల్ షో వేసీనట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర, నారా లోకేష్ – బ్రాహ్మణి దంపతులు, మరికొందరు సన్నిహితులు స్పెషల్ షోని వీక్షించినట్టు చెబుతున్నారు.

సినిమా చూసిన తర్వాత చప్పట్లో బాలయ్యని అభినందించారట. యుద్ద సన్నివేశాల్లో బాలయ్య నటన పీక్స్ చేరినట్టు బాలయ్య కుటుంబ సభ్యుల టాక్. ఇక, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది.