gouthami
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ టాక్ వచ్చేసింది. శాతకర్ణి బ్లాక్ బస్టర్ హిట్టని తేల్చేశాడు బాలయ్య అల్లుడు నారాలోకేష్. ఇప్పటికే ప్రీమియర్ షో చూశాం. బాలయ్య నటన అద్భుతం. అమరావతి గొప్పదనాన్ని దర్శకుడు చాలా బాగా వివరించాడు అన్నారు లోకేష్. ఈ సినిమా ద్వారా అమరావతి గొప్పదనాన్ని తెలిసుకున్నామన్నారు. అల్లుడు లోకేష్, కూతురు బ్రాహ్మణి బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపారు.

సంక్రాంతి బరిలో నిలిచిన రెండు క్రేజీ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సూపర్ హిట్ అని తేలిపోయింది. ఇప్పుడంతా బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటికే నందమూరి అభిమానులు థియేటర్స్ దగ్గర ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇవాళ కొన్ని చోట్ల శాతకర్ణి విజయాన్ని కాంక్షిస్తూ ర్యాలీలు కూడా తీశారు.

తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన
చిత్రమిది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్.

Latest News