ప్రేమ దోమ వద్దంటున్న వెంకీ
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘గురు’. బాలీవుడ్ చిత్రం ‘సాలా ఖండూస్’కి రిమేక్ ఇది. సుధా కొంగర దర్శకురాలు. ఇందులో వెంకీ బాక్సింగ్ కోచ్ గా
కనిపించబోతున్నారు. ఆయన శిష్యురాలుగా రితికా సింగ్ నటించనుంది. సినిమాలో రితికా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించబోతున్నారు.

తాజాగా, ‘గురు’ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. బాక్సింగ్ కోచ్ గా వెంకీ అగ్రసివ్ గా కనిపిస్తున్నాడు. వెంకీ మాటలు, విజువల్స్ తో ఓ సీరియస్ మూడ్ లో సాగింది టీజర్. గురుగా వెంకీ గెటప్ బాగుంది.

ఇప్పటికే తమిళ్, హిందీ బాషల్లో సూపర్ హిట్టైన ఈ కథపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా ‘గురు’ ప్రీ-రిలీజ్
బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే గురు శాటిలైట్ రైట్స్ ని రూ. 5కోట్లకి జెమినీ టీవీ సొంతం చేసుకొంది. ఈ చిత్రం ఇతర రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. లెటెస్ట్ టీజర్ పై మీరు ఓ లుక్కేయండీ..

Latest News