తెలుగు మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. అదే వెంకటేష్ గురు. రెగ్యులర్ సినిమా కాదిది. ఓ బాక్సింగ్ కోచ్ కధ. ‘సాలా ఖడూస్‌’ అనే బాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌గా సుధ కొంగర ఈ... ప్రేమ దోమ వద్దంటున్న వెంకీ

Guru

తెలుగు మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. అదే వెంకటేష్ గురు. రెగ్యులర్ సినిమా కాదిది. ఓ బాక్సింగ్ కోచ్ కధ. ‘సాలా ఖడూస్‌’ అనే బాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌గా సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు తాజగా ఈ చిత్రం ట్రైలర్ బయటికి వచ్చింది.

చాలా డిఫరెంట్ గా సాగింది ఈ ట్రైలర్. ”బాక్సింగే తన ప్రపంచమని అని వెంకీ చెప్పిన డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి’అని వెంకీ చెప్పిన డైలాగ్ క్యాచిగా వుంది.

ఇందులో బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతికా సింగ్ నే తెలుగులో కూడా నటిస్తుంది. సుధా కొంగర దర్శకత్వం వహించే ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. కబాలి ఫేం సంతోష్‌ నారాయణ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకువస్తుంది.

లేటెస్ట్ గాసిప్స్