హన్సికని ఒంటరిని చేశారు


హీరోయిన్ హన్సికని ఒంటరిని చేయడం హాట్ టాపిక్ గా మారింది. మనోజ్ దామోదరన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి, హన్సిక ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి పార్టనర్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇవాళ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
టైటి పార్టనర్ అయినా.. సినిమాలో హన్సికకి పార్టనర్ లేడట. ఈ విషయాన్ని హన్సిక సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

‘తాను నటిస్తున్న కొత్త సినిమా ‘పార్ట్‌నర్’. ఇందులో ఎవ్వరితోనూ జోడీ కట్టడం లేదదు. సినిమాలో తనది ఒక డిఫెరెంట్ రోల్. గతంలో ఎప్పుడూ చేయని రోల్‌లో ఈ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమాలో నటించేందుకు ఆతృతగా ఉందని తెలిపింది పాలబుగ్గల సుందరి.