హ్యాపీ బర్త్ డే.. సాయి పల్లవి


ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఫ్యాన్స్ ఏర్పడటం చాలా అరుదు. కానీ సాయి పల్లవి విషయంలో జరిగిపోయింది. మలయాళం ‘ప్రేమమ్’ తో సెన్సేషనల్ స్టార్ అయ్యింది సాయిపల్లవి. ఈ సినిమాని మలయాళంలో చూసి ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు మిగతా సినీ జనాలు. ఫిదాతో టాలీవుడ్ కి వచ్చింది పల్లవి. ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. అయితే ఆల్రెడీ ప్రూవ్ అయిన హీరోకి వచ్చినంత అప్లాజ్ వచ్చింది

మలయాళ ‘ప్రేమమ్‌’ చూసి సాయి పల్లవికి ఎందుకంతగా ఫిదా అయిపోయారో, ఆమెని అంత స్పెషల్‌గా ఎందుకు చూస్తారో ఇందులో ‘భానుమతి’గా ఆమెని చూస్తే తెలిసింది. సొంత డబ్బింగ్‌తో తెలంగాణ యాసని పొల్లుపోకుండా మాట్లాడుతూ.. తెరపై నటిస్తోన్న హీరోయిన్‌లా కాకుండా మనకి బాగా తెలిసిన అమ్మాయి భానుమతిని మాత్రమే కనిపించేట్టు చేసిన సాయి పల్లవి ఆ చిత్రం సక్సెస్ లో బిగ్గెస్ట్‌ ఎస్సెట్‌.

సాయి పల్లవి ఇప్పడు టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్. ఆమె ఓకే అంటే చాలు… అడ్వాన్స్ లు ఇచ్చేయడానికి బోలెడు మంది నిర్మాతలు లైన్ లో వున్నారు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ తో పడిపడి లేచే మనసు సినిమాలో నటిస్తుంది. అన్నట్టు.. ఈ రోజు సాయిపల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విశేష్ అందిస్తుంది తెలుగు మూవీస్.