హ్యాపీ బర్త్ డే ‘రిషి’ !

అతడు మహేష్. ఆయన్ని తెరపై చూస్తే చాలు ప్రేక్షకుడికి పిచ్చెక్కిపోతుంది. అంతటి క్రేజ్ సంపాదించుకొన్న మహేష్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రాజకుమారుడు.. శ్రీమంతుడు.. మహర్షి.. తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నేడు మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్.

1975 ఆగస్ట్ 9న చెన్నైలో మహేష్ జన్మించాడు. 4యేళ్ల వయసులోనే బాల నటుడిగా ‘నీడ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీస్టారర్ మూవీస్ కి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇప్పటికే మహేష్ ఖాతాలో 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను ఉన్నాయి. టాలీవుడ్ నెం.1 స్థానం కోసం ప్రధాన పోటిదారుడు మహేష్ నే. ణ్, మహేష్ మంచి స్నేహితులు. ఇటీవల ఒకట్రెండు సందర్భాల్లో ఈ తీ-స్టార్స్ ఒకవేదికపై కనిపించి ప్రేక్షకులని మురిపించారు.

ఇక, అభిమానులకు మహేష్ పుట్టినరోజు కానుకని అందజేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తన 25వ సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మహర్షి’ టైటిల్ ని పెట్టారు. సినిమాలో మహేష్ రిషి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిసింది. మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.