ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే గిఫ్ట్

క్రిష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత రాఘవేంద్ర రావు – నాగ్ ల ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నటించింది. గుంటూరోడు, నక్షత్రం, జయజానకి నాయక లాంటి సినిమాల్లో మెరిసింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే గిఫ్ట్ ని అందజేసింది ‘ఆచారి అమెరికా యాత్ర ‘ చిత్రబృందం.

జి. నాగేశ్వ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు-ప్రగ్యా జైశ్వాల్ జంటగా ‘ఆచారి అమెరికా యాత్ర’ తెరకెక్కుతోంది. బ్రహ్మనందం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌గ్యా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంచు విష్ణు ఆమెకు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ప్ర‌గ్యా జైస్వాల్ ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.