హాలో గురూ.. హ్యాపీ బర్త్ డే !

ఎవరెస్ట్ అంత ఎనర్జి కలిగిన హీరో రామ్. ఆయన ప్లస్సు, మైనస్సు కూడా ఆ ఎనర్జినే. తన ఎనర్జిటిక్ ఫర్ ఫామెన్స్ దేవదాసు, జగడం, రెడీ, కందిరీగ, నేను శైలజ లాంటి హిట్స్ ని తెచ్చిపెట్టింది. కొన్ని ప్లాపులు కూడా ఇచ్చిందనుకోండి.. ! మొత్తంగా టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోగా రామ్ గుర్తింపు తెచ్చుకొన్నాడు. నేడు ఈ ఎనర్జిట్ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్.

‘నేను శైలజ’ హిట్ తర్వాత రామ్ చేసిన హైపర్, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలు ప్లాపులుగా తేలాయి. ఈ నేపథ్యంలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం త్రినాథరావు నక్కినతో జతకట్టాడు రామ్. ‘హాలో గురూ ప్రేమకోసమే’ చేస్తున్నాడు. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ జతకట్టనుంది. ఇప్పటికే టైటిల్ లుక్ బయటికొచ్చింది. ఈ సినిమాతో రామ్ కెరీర్ మరింత ఊపందుకోవాలని ఆశిస్తూ.. ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.