హ్యాపీ బర్త్ డే రానా దగ్గుపాటి

టాలీవుడ్ లీడర్, భళ్లాళ దేవుడు రానా దగ్గుపాటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ తెలుగు మూవీస్. దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి బాబాయ్ విక్టరీ వెంకటేష్ తర్వాత తెలుగుకు పరిచయమైంది రానా నే. పుట్టినరోజు కూడా బాబాయ్ వెంకీ పుట్టినరోజు (డిసెంబర్ 13) తర్వాత రోజు (డిసెంబర్ 14)న జరుపుకోవడం విశేషం.

శేఖర్ కమ్ముల ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రానా దగ్గుపాటి. విక్టరీ వెంకటేష్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా.. ఇప్పటికే బాబాయ్ ని మించిపోయాడని చెప్పుకోవచ్చు. ‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడానే లేదు రానాకి. అంతటా తానే. నటుడు కావాలనుకొనేవాడు.. రానాని ఆదర్శంగా తీసుకొనే రేంజ్ కి ఎదిగాడు. ఎందుకంటే.. ? రానాకు లిమిట్స్ లేవు. బాషతో సంబంధం లేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు నటించగల సత్తా ఉన్న నటుడు అనిపించుకొన్నాడు.

రానా ఎప్పటిలాగే లీడర్, బాహుబలి, ఘాజీ, నేనే మంత్రి నేనే రాజు.. లాంటి మరిన్ని సినిమాల్లో నటించాలని, తెలుగు, భారతీయ ప్రేక్షకులు, ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులని తన సినిమాలతో అలరించాలని కోరుకొంటూ మరోసారి మన భళ్లాళకు జన్మదిన శుభాకాంక్షలు.