హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా.. !!

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్’గా ఎదగడం మాములు విషయం కాదు. అలాస్టార్ ఎదిగి. టాలీవుడ్ మాస్ మాహారాజు అనిపించుకొన్నాడు రవితేజ. నేడు ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్.

గత యేడాది ‘రాజా ది గ్రేట్’తో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ బిజీ అయిపోయాడు. ఆయన తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’ రిలీజ్ కి రెడీగా ఉంది. మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో శ్రీనివైట్ల సినిమా ఒకటి.

ఇక, ఈరోజు మాస్ మ‌హారాజా త‌న జ‌న్మ‌దిన వేడుక‌ను కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో సింపుల్ గా జ‌రుపుకున్నారు. ఐతే, ఆయనకు సోషల్ మీడియా వేదికగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.