స‌ల్మాన్ బ‌ర్త్‌డే స్పెషల్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. నేటితో ఆయన 52వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సల్మాన్’కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.

పన్వేల్‌లో పుట్టినరోజు వేడుకలకు గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు సల్మాన్. ‘టైగర్ జిందా హై’ కోస్టార్ కత్రినాకైఫ్‌తో కలిసి పన్వేల్‌లో సందడి చేశాడు . బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ఇండస్ట్రీకి చెందిన స్టార్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స‌ల్మాన్ బర్త్ డేను పురస్కరించుకుని గాయ‌ని ఆశా భోస్లే పాడిన తుమ్ జియో హజారో సాల్ పాట‌కి న‌టుడు షారుక్ ఖాన్ సందడి చేశాడు.

సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. డిసెంబర్ 27, 1965న జన్మించాడు. ప్రముఖ బాలీవుడ్ రచయిత సలీమ్ ఖాన్, ఆయన మొదటి భార్య సల్మా ఖాన్ పెద్ద కుమారుడే సల్మాన్ ఖాన్. స్కూల్ డేస్ లో సల్మాన్ ఖాన్… గొప్ప ఈతగాడిగా పేరుపొందాడు. బీవీ హోతా హై ఆసి(1988) చిత్రంలో సహాయ నటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘మైనే ప్యార్ కియా’ సల్మాన్ ఖాన్ తొలి సూపర్ హిట్ అందుకున్నాడు. 2010లో దంబాంగ్ సినిమాతో ప్రారంభమైన సల్లూభాయ్ విజయ ప్రస్థానం… ఆ తర్వాత వచ్చిన రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్ 2 చిత్రాల్లోనూ కంటిన్యూ అయింది. ఈ చిత్రాలన్నీ కూడా రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం.