అతిలోక సుందరికి జన్మదిన శుభాకాంక్షలు

sridevi
తరాలు మారినా తరగని అందం. గ్లామర్ క్వీన్, తెలుగు ప్రేక్షకుల అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.

బాల న‌టిగా తెరంగేట్రం చేసిన శ్రీదేవి.. దక్షణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంలో ఆమెకి సాటేలేరు. అయితే, పెళ్లి తర్వాత నటనకి దూరమైన శ్రీదేవి.. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ స్టార్ విజయ్ ‘పులి’లో కీలక పాత్రలో కనిపించింది. ‘బాహుబలి’లో శివగామి కోసం ముందుగా శ్రీదేవినే సంఫ్రదించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పడం జరిగింది. ఇక, ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీదేవి ‘మామ్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. కాస్త గ్యాప్ తర్వాత నటించిన మామ్ లో ఎమోషనల్ సీన్స్ లో కట్టిపడేసే నటనని కబర్చింది శ్రీదేవి.

sridevi

తెలుగులో అతిలోక సుందరి నటించిన సూపర్ హిట్ చిత్రాలు.. పదహారేళ్ళ వయసు, బుర్రిపాలెం బుల్లోడు, కార్తీక దీపం, వేటగాడు, చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, సర్దార్‌ పాపారాయుడు, గజదొంగ, మోసగాడు, ఆకలి రాజ్యం, గడసరి అత్త సొగసరి కోడలు, గురుశిష్యులు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, రాణి కాసుల రంగమ్మ, ఇల్లాలు, సత్యం శివం, త్రిశూలం, అనురాగ దేవత, బొబ్బిలి పులి, జస్టీస్‌ చౌదరి, కలవారి సంసారం, ‘కృష్ణార్జునులు’, ‘కృష్ణవతారం’, ‘వయ్యాల భామలు వగలమారి భర్తలు’, ‘అడవి సింహాలు’, ‘కిరాయి కోటిగాడు’, ‘ముందడుగు’, ‘రామరాజ్యంలో భీమరాజు’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘శ్రీరంగనీతులు’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘తేనే మనసులు’ ‘కంచు కాగడ’, ‘పచ్చని కాపురం’, ‘వజ్రాయుధం’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’, ‘జయం మనదే’, ‘ఆఖరి పోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణక్షణం’, ‘గోవిందా గోవిందా’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

sridevi

శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి త్వరలో తెరకు పరిచయం కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్-దర్శక నిర్మాత కరణ్ జోహార్ బ్యానర్ లో జాహ్నవి ఎంట్రీ ఉండనుందని చెబుతున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అతిలోక సుందరి మరిన్ని సినిమాలతో ప్రేక్షకులని అలరించాలని, తెలుగు సినిమాల్లోనూ ఆమె నటించాలని కోరుకుంటూ ఆమెకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది.. మీ తెలుగు మూవీస్.

sridevi-daughters