హ్యాపీ బర్త్ డే.. అధ్యక్షా.. !

అధ్యక్షా.. ఈరోజు ప్రముఖ హాస్య నటుడు సుమన్ శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్.

తెలుగు తెరపై వి’జయం’ సాధించిన హాస్యనటుల్లో సుమన్ షెట్టి ఒకరు. ఆయన తెలుగు, తమిళ భాషలలో కలిపి సుమారు 70కిపైగా చిత్రాలలో నటించారు. జయం, 7జి బృందావన్ కాలనీ, హ్యాపీ, రణం, యజ్ఝం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి… సినిమాల్లో సుమన్ షెట్టి పండించిన హ్యాసం హైలైట్ గా నిలిచింది.

సుమన్ శెట్టి స్వస్థలం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. ప్రముఖ సినీ రచయిత సత్యానంద్ అతనిలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. దర్శకుడు తేజ ‘జయం’ సినిమాలో అవకాశాం ఇచ్చారు. సుమన్ షెట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని.. ప్రేక్షకులని మరింతగా నవ్వించాలని కోరుకొంటూ.. ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.