ఇండియన్‌ మ్యూ జిక్‌ లెజెండ్‌ కె.జె. ఏసుదాసు పుట్టిన రోజు (జనవరి10) ఈరోజు. ఈ సందర్భంగా.. అమృత గాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్. జనవరి 10,... ‘అమృత గాయకుడు’కి జన్మదిన శుభాకాంక్షలు

yesudasu
ఇండియన్‌ మ్యూ జిక్‌ లెజెండ్‌ కె.జె. ఏసుదాసు పుట్టిన రోజు (జనవరి10) ఈరోజు. ఈ సందర్భంగా.. అమృత గాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.

జనవరి 10, 1940లో కొచ్చిలో జన్మించారు ఏసుదాసు. నేటితో ఆయన 77వ వడిలోకి అడుగు పెడుతున్నాడు. ఇప్పటివరకు దాదాపు 50,000 సాంగ్స్ పైగా పాడారు. వీనులవిందైన స్వరం, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే శైలి ఆయన ప్రత్యేకత.

నవంబరు14, 1961న ‘Kaalpaadukal’ చిత్రం కోసం తొలిపాటని ఆలపించారాయన. మాతృభాష మళయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలి, గుజరాతి, ఒడియా, మరాఠి, సంస్కృ తం, తుళు వంటి భారతీయ భాషలతోపాటుగా.. మాలే, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఇంగ్లీష్‌ వంటి విదేశీ భాష ల్లోనూ పాటలు పాడి మెప్పించారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాష్ట్రస్థాయిలో 30సార్లు, జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా ఏడుసార్లు ఏసుదాసు అవార్డును అందుకున్నారు.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్