హలో గురూ.. రిలీజ్ డేటు ఫిక్స్ !

సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ సినిమాలతో తనేంటో నిరూపించుకొన్నాడు దర్శకుడు త్రినాథ రావు నక్కిన. ఆయన దర్శకత్వంలో రామ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలివుంది. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేటు ఫిక్సయినట్టు తెలిసింది.

దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాని విడుదల చేయనున్నారు. ఈలోగా మిగిలిపోయిన పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో ప్ర‌కాశ్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు నిర్మాత.

‘ఉన్నది ఒక్కటే సినిమా’ తర్వాత రామ్ – అనుపమ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఈ జంట బాగుందని భావించి.. హలో గురూ.. కోసం మళ్లీ అనుపనే తీసుకొన్నారు. ఈ మధ్య అనుపమ వరుసపెట్టి యంగ్ హీరోలతో జతకడుతోంది. ఈ నేపథ్యంలో రామ్ తో రెండోసారి జతకట్టింది.