తేజు కు కొత్త సమస్య..

చిత్రలహరి తో హిట్ అందుకొని మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన తేజ్ కు మరో సమస్య వెంటాడుతుంది. ప్రస్తుతం తేజ్ మారుతీ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో తేజ్ సరసన సెట్ ఆయె హీరోయిన్ దొరకడం లేదట. పోనీ పెద్ద హీరోయిన్ ను ట్రై చేద్దామంటే బడ్జెట్ ప్రాబ్లెమ్..పోనీ కొత్త అమ్మాయిని ఓకే చెపుదామంటే ఆడియన్స్ ..అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం..దీంతో డైరెక్టర్ మారుతీ హీరోయిన్ కోసం గట్టిగా వేట సాగిస్తున్నాడట.

ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న భామలంటే రష్మిక..పూజా హగ్దే లే..రాశిఖన్నా..అనుపమ..మెహ్రీన్…రెజీనా ఇలా మరో ముగ్గురు నలుగురు ఉన్నప్పటికీ వారంతా ఆల్రెడీ తేజ్ తో జోడి కట్టిన వారే..మళ్లీ వారినే సెలెక్ట్ చేస్తే బాగోదని చూస్తున్నారట. మొత్తం మీద మరోసారి హీరోయిన్ కొరత ఇండస్ట్రీ లో ఎంత ఉందొ బయటపడింది. మరి ఫైనల్ గా తేజ్ కు జోడి ఎవర్ని సెట్ చేస్తారో చూడాలి.