కార్తికేయ ‘హిప్పీ’ .. ముద్దులే ముద్దులు

తెలుగు సినిమా కూడా బాలీవుడ్ సినిమాని బీట్ చేస్తుంది. ముద్దుల విషయంలో. మన ఫిలిం మేకర్స్ కి ముద్దుల పై కసి పెరిగిపోయింది. ఇంతకుపూర్వము టీజర్ అంటే ఓ యాక్షన్ సీన్ ఒక డైలాగ్ చిన్న సస్పెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నాలుగు ఐదు ఎంగిలి ముద్దులు కలిపి టీజర్ ని వదులుతున్నారు. మొన్న వచ్చిన డియర్ కామ్రేడ్ టీజర్ లో కూడా ఇదే చేశారు. ఇప్పుడు హిప్పీ’ సినిమా టీజర్ కూడా ఇలానే వుంది. ఆర్‌ఎక్స్‌ 100’తో సూపర్‌హిట్‌ అందుకున్న కథానాయకుడు కార్తికేయ నటిస్తున్న సినిమా ‘హిప్పీ .

ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకొకర్ని పట్టుకున్నారు. అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు తెలుసా..’ అని కార్తికేయతో వెన్నెల కిశోర్‌ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. టీజర్ మొత్తం ఏమిటో గానీ చివర్లో వచ్చిన ఎంగిలి ముద్దుతో యూత్ ని టార్గెట్ చేశారు.