ఎన్టీఆర్ కోసం ఫారిన్ బ్యూటీ ఎందుకంటే.. ?


రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ కోసం హీరోయిన్స్ లిస్టులో పరిణితి చోప్రా, కైరా అద్వానీ , అలియా భట్.. బాలీవుడ్ బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ ని బ్యూటీని తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ కోసం ఫారిన్ బ్యూటీ ఎందుకంటే ?

‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్రర్యం కాలం నాటి ఈ కథ. ఇందులో ఎన్టీఆర్’తో ఓ బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడుతుందట. ఆమె అప్పటి గవర్నర్ కూతరు అని చెప్తున్నారు. అందుకే ఎన్టీఆర్ కోసం ఫారిన్ బ్యూటీని వెతికే పనిలో జక్కన్న ఉన్నట్టు తెలుస్తోంది’

మరోవైపు, ఆర్ఆర్ఆర్ లో ఎన్ టీఆర్ అడవిదొంగగా, ఆయన్ని పట్టుకొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. సినిమాలో హీరోయిన్స్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం ఉండదని, అందుకే రాజమౌళి హీరోయిన్స్ ఎంపికలో జక్కన్న జాప్యం చేస్తున్నారని సమాచారమ్.