ఇస్మార్ట్ శంకర్ టీజర్ చూసారా..?

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను ఈరోజు రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు.

టీజర్ మొత్తం కూడా పూరి గత సినిమాల మాదిరిగానే యాక్షన్ ..డైలాగ్స్ తో నింపేసాడు. కొత్తదనం ఏమి అనిపించకపోయినప్పటికీ రామ్ మాత్రం రఫ్ గా కనిపిస్తూ ఊర మాస్ గా కనిపించాడు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అంటూ రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెపుతూ..డ్యాన్స్‌, ఫైటింగ్‌ లతో ఆకట్టుకున్నాడు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మాత‌లగా వ్యవహరిస్తుండగా , మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.