‘జై సింహా’ ఫైనల్ లెక్క ఇది !

ఈ సంక్రాంతికి బాలకృష్ణ ‘జై సింహా’ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నందమూరి అభిమానులకి బాగానే ఆకట్టుకొంది. కాస్త నెగటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ లో మాత్రం అదరగొట్టింది. తాజాగా జై సింహా ఫైనల్ లెక్కలు తేలాయి. మొత్తంగా జై సింహా రూ. 35.85కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 28.25 కోట్లు షేర్‌ రాబట్టగా.. కర్ణాటకలో 4.30 కోట్లు, ఇతర రాష్ట్రాల నుంచి 2.10 కోట్లు, ఓవర్‌ సీస్‌ నుంచి 1.20 కోట్ల షేర్‌ సాధించింది. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్‌ భట్‌. సి. కళ్యాణ్ నిర్మాత.