జాన్వీ కోసం భన్సాలీ.. !

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇవనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే జాన్వీ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు బాలీవుడ్ సమాచారమ్. ఏకంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జాన్వీ రెండో సినిమా ఉండనుందట. ఎందరినో స్టార్ హీరోయిన్స్ ని చేసిన ఘనత భన్సాలీ ది. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే హీరోయిన్స్ కి మంచి బ్రేక్ లభించినట్టేనని చెబుతుంటారు.

ఇటీవలే జాన్వీ భన్సాలీ ఆఫీసులో కనబడింది. దీంతో జాన్వీ రెండో సినిమా భన్సాలీ దర్శకత్వంలో ఉండనుందనే చెప్పుకొంటున్నారు. ప్రేమ కథలు తెరకెక్కించడంలో భన్సాలీ స్పెషలిస్టు. జాన్వీ కోసం ఓ అందమైన ప్రేమ కథని రెడీ చేసినట్టు విశ్వసనీయ సమాచారమ్. ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన భన్సాలీ ‘పద్మావతి’ సూపర్ హిట్టయింది. వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రశంసలు అందుకొంది.