‘మా’ వివాదంపై జీవిత రాజశేఖర్ వివరణ

మా అసోసియేషన్ లో కొత్త వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మా డబ్బులు రూ. 7.5లక్షలు తెలంగాణ ప్రభుత్వం మీద ప్రకటనలు చేసేందుకు ఖర్చు చేశారు. ఐతే, ఆ మొత్తాన్ని నేరుగా ఖర్చు పెట్టకుండా.. ముందుగా ఆ మొత్తాన్ని రాజశేఖర్ కూతురు ఖర్చు పెట్టి.. ఆ తర్వాత మా ఖాతా నుంచి తీసుకొన్నారు. ఇప్పుడది వివాదంగా మారింది. తాజాగా, దీనిపై జీవిత రాజశేఖర్ వివరణ ఇచ్చారు.

మా అసోసియేషన్ లో తాము అంతా నిబంధనల ప్రకారమే చేసింది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు పేదవారు, అర్హులైన సభ్యులు వుంటే మా సంఘంలో వారికి కూడా అదేలా చేస్తామని హామీ ఇచ్చిందని, అందుకే తమ వంతుగా ఆ మంచి పథకాలకు ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. చాలా తక్కువ ఖర్చుతో ఏడున్నర లక్షలతో ప్రకటనలు రూపొందిచామన్నారు. మొదట ఆ ఖర్చుని మేము భరించి తర్వాత తీసుకొన్నాం అన్నారు. మా అధ్యక్షుడు నరేష్ అందుబాటులో లేకపోవడం వల్ల అలా చేశామన్నారు.