జెర్సీ’ బ్లాక్ బస్టర్ కాదు : నాని


గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం జెర్సీ. శ్రద్దాశ్రీనాథ్ కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ వారమే (ఏప్రిల్ 19) జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొని విడుదలకి లైన్ క్లియర్ చేసుకొంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. బ్లాక్ బస్టర్ హిట్.. ‘జెర్సీ’కి చాలా తక్కువ. అంతకుమించిన విజయం సాధిస్తుంది. హిట్, బ్లాక్ బస్టర్.. రొటీన్. జెర్సీ ప్రేక్షకులని హృదయాలని టచ్ చేసే సినిమా. ఈ సినిమా చేసినందుకు గర్విస్తున్నా. సినిమా చూసిన తర్వాత అభిమానులు గర్వపడతారని అన్నారు నాని.