రాజమౌళి రివ్యూ : జెర్సీ


దర్శకధీరుడు రాజమౌళి రివ్యూ ఇచ్చారంటే ఆ సినిమా హిట్ క్రిందే లెక్క. ఐతే, ఈసారి ఆల్రెడీ మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుక్కొన్న సినిమాకి రాజమౌళి రివ్యూ ఇచ్చారు. అదే జెర్సీ.

‘జెర్సీ మనసుకు హత్తుకునే సినిమా. జాయ్ ఫుల్ మూవీ అంటూ ప్రశంసలు గుప్పించారు. జెర్సీ స్క్రిప్టు రాసిన విధానం బావుంది. ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా క్రాఫ్ట్ చేయబడి, డైరెక్ట్ చేయబడింది. వెల్ డన్ గౌతమ్ తిన్ననూరి’ అని రాజమౌళి ప్రశసించారు.

‘జెర్సీ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ గర్వపడే సందర్భం ఇది. నాని ‘బాబు’ సూపర్‌గా చేశావ్. జస్ట్ లవ్ యూ అంతే’ అన్నారు. రాజమౌళి ట్వీట్ నాని స్పందిస్తూ… ‘సార్.. ఇంతకంటే ఆనందం ఏమీ ఉండదు. వి లవ్ యూ టూ’ అని ట్వీట్ చేశారు.