జెర్సీ రన్ టైం…

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన స్పోర్ట్స్ నేపధ్య మూవీ జెర్సీ. నిర్మాణ కార్య క్రమాలు అన్ని పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలన్ని పూర్తి చేసి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా నిడివి బయటకొచ్చింది. మొత్తం 160 నిమిషాల నిడివి తో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.

గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలతో ప్రేక్షకులను , అభిమానులను నిరాశ పరిచిన నాని..ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైనా చిత్ర ట్రైలర్స్ , ప్రోమోస్ , సాంగ్స్ ఇలా అన్ని కూడా సినిమా ఫై పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు. ఈ చిత్రం లో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మి నిర్మించింది.