సంక్రాంత్రి రేసులో నాని ‘జెర్సీ’ !

నేచురల్ స్టార్ నాని సడెన్ గా సంక్రాంత్రి రేసులోకి దూసుకొచ్చాడు. ఆయన తాజా చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ‍నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్ ని సంక్రాంత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఈ విషయాన్ని చెబుతూ నాని ట్విట్ చేశారు. జెర్సీ టీజర్ ని ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్టు ఓ పోస్టర్ ని షేర్ చేశారు. ఇందులో నాని మైదానంలో క్యాచ్ పట్టుకొనేందుకు పరుగెడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19వ ‘జెర్సీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.