ఆన్’లైన్’లో ‘కాలా’ యాక్షన్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఈ యేడాది రెండు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో రోబో ‘2.ఓ’ ఒకటి. రెండోవది రంజిపా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలా’. ఈ సినిమాని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఐతే, ఇంతలో చిత్రబృందానికి పెద్ద షాక్ తగిలింది.

ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఇంటర్ నెట్ లో లీకయ్యాయి. ఎలా అయ్యాయి ? ఎవరు చేశారు ?? అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ లీకుతో చిత్రబృందం అప్రమత్తమైంది. దొంగలని గుర్తించే పనిలో పడింది. మరిన్ని సీన్స్ లీకు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇక. లీకైన యాక్షన్ సీన్స్ అదిరిపోయిందని చూసిన నెటిజర్స్ చెబుతున్నారు.