తేజని మళ్లీ కాకపడుతున్న కాజల్

నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీత’. కాజల్ హీరోయిన్. బెల్లకొండ శ్రీనివాస్, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథని తేజ ముందుగా కాజల్ వినిపించాడట. ఆమె నేనే చేస్తానని పట్టుబట్టడటంతో తప్పలేదని సినిమా ప్రమోషన్స్ లో తేజ చెప్పారు.

అంతేకాదు.. సీత తర్వాత తేజ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కూడా కాజల్ రెడీ అయినట్టు సమాచారమ్. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే ఓ క‌థ‌ని కాజ‌ల్ కోసం తేజ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. నిర్మాత‌లు కూడా రెడీగానే ఉన్నార్ట‌. `సీత‌`కు వ‌చ్చిన స్పంద‌న బ‌ట్టి.. వెంట‌నే ఈ కాంబోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలా? లేదంటే ఇంకొన్ని రోజులు ఆగాక మొద‌లెట్టాలా? అనేది ఆలోచిస్తార‌ట‌.