నిర్మాతగా కాజల్ !


టాలీవుడ్ స్టార్ హీరోలు నిర్మాతలుగా టర్న్ తీసుకొంటున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్.. తదితరులు సొంతంగా బ్యానర్స్ ఏర్పాటు చేసుకొంటున్నారు. సొంత బ్యానర్ లో ఇతర హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా తక్కువేం తినలేదు. వాళ్లు నిర్మాతగా మారేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు.

స్టార్ హీరోయిన్ కాజల్ నిర్మాతగా మారబోతుంది. ‘కేఏ మూవీస్’ అనే బ్యానర్ పై తనే నిర్మాతగా, నటిగా ఓ సినిమా చేయాలని కాజల్ భావిస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మను దర్శకుడిగా ఎంచుకుంది. అంతేకాదు.. ఈ బ్యానర్ లో మరో స్లీపింగ్ పార్టనర్ కూడా ఉంది. ఆమె కూడా స్టార్ హీరోయిన్ నే. మిల్కీబ్యూటీ తమన్నా. తమన్నాతో కలిసి కాజల్ కొత్త బ్యానర్ ని మొదలెట్టింది అన్నమాట.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా.. నిర్మాతగా బిజీ అయిపోవాలని ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్లాన్ లా కనబడుతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా సినిమాలేవీ. కాజల్ కు మాత్రం బిజీగానే ఉంది. ప్రస్తుతం ఇండియన్ 2లో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కాజల్ సొంత బ్యానర్ లో సినిమా ఉండనుందని తెలుస్తోంది.