కాలా టీజర్ కొత్త రికార్డ్

‘నేనొక్కడినే వచ్చాను. దమ్మున్నోడు రండిరా.. మీరింకా నా పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు. చూస్తారు’అని వార్నింగ్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ టీజర్ లో. తాజాగా విడుదలైన ‘కాలా’ చిత్రం టీజర్‌ కూడా అరుదైన మైలురాయిని దాటింది. తమిళ టీజర్‌ యూట్యూబ్‌లో మొత్తం 2 కోట్లు వ్యూస్‌ను దక్కించుకుంది. మొత్తం 4.7 లక్షల మంది టీజర్‌ బాగుందని లైక్‌ చేశారు.

వండర్‌బార్‌ స్టూడియోస్‌ పతాకంపై హీరో ధనుష్‌ ‘కాలా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముంబయికి చెందిన గ్యాంగ్‌స్టర్‌‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రజనీ ముంబయిలోని మురికివాడలో నివాసం ఉండే తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. ఏప్రిల్‌ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.