కళ్యాణ్ లుక్.. అదిరిపోయింది !

కొత్త దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ఎంట్రీ సినిమా ‘విజేత’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడీ సినిమాలో కళ్యాణ్ దేవ్ లుక్’ని విడుదల చేసింది చిత్రబృందం. కళ్యాణ్ చాలా ఫ్రెష్’గా కనిపిస్తున్నాడు.

రేపు ‘విజేత’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. బలమైన సోషల్ మెసేజ్ ఉంటుందని చెబుతున్నారు. ‘ఎదుటివారి కష్టాలను తీర్చి వారి మొహంలో చిరునవ్వు పూయించడం కూడా విజయమే’ అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ‘విజేత’తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

కల్యాణ్ సరసన మాళవిక నాయర్‌ జతకట్టనుంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం. సాయికొర్రపాటి నిర్మాత.