కళ్యాణ్ గొప్ప నిర్ణయం

మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గొప్ప నిర్ణయం తీసుకొన్నాడు. ఇవాళ కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అవయవ దానం చేయాలని కల్యాణ్ నిర్ణయించుకున్నారు. అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో అవయవదానం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు కళ్యాణ్.

‘ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నాను. ట్విటర్‌లో ఉండటం సులువే కానీ ఏదన్నా విలువైన అంశంతో ఈ ట్విటర్ ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకున్నాను. అందుకే నా వంతుగా అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో అవయవదానం చేశాను. ఎంతైనా మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం కదా.. ప్రేమతో మీ కల్యాణ్‌ దేవ్‌’ అని రాసుకొచ్చారు.

‘విజేత’ సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా హిట్ అవ్వకున్నా.. ప్లాప్ మాత్రం అవ్వలేదు. ఓ మాదిరిగా ఆడిందంతే. ఇక, రెండో సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకొని మరీ.. శిక్షణ తీసుకొన్నాడు కళ్యాణ్. పులివాస్ దర్శకత్వంలో ఆయన రెండో సినిమా తెరకెక్కనుంది. బర్త్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.