నాగశౌర్య ‘కణం’ సెన్సార్ టాక్

విజయ్‌ దర్శకత్వంలో నాగశౌర్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం “కణం”. తెలుగు, తమిళ్ బాషల్లో ఈ నెల 23న రిలీజ్ కానుంది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డ్ ‘కణం’ యు/ఎ సర్టిఫికెట్ ని జారీ చేసింది.

సినిమాలో నాగశౌర్య-సాయి పల్లవిలు భార్య భర్తలుగా కనిపిస్తారు. ఓ బిడ్దకు తల్లిగా సాయి పల్లవిని చూడబొతున్నాం. సినిమా విభిన్నంగా ఉందన్నది సెన్సార్ సభ్యుల టాక్. హీరో-హీరోయిన్స్ నటన, సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.

ఈ చిత్రంలో నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమా నిర్మించింది.