కంగనా కబడ్డీ ఆడబోతుంది

బాలీవుడ్ క్వీన్ కంగనా ర‌నౌత్ కబడ్డీ ఆడబోతుంది. అశ్వినీ అయ్యర్‌ దర్శకత్వంలో కంగనా కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కంగనా కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతుంది. దీని కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీసు మొదలెట్టింది కంగనా. ఆమెకు ట్రైయినింగ్ ఇప్పించేందుకు దర్శకుడు స్టార్ కబడ్డీ ప్లేయర్స్ ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారమ్.

ప్రస్తుతం కంగనా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో ఒకటి ‘మెంటల్‌ హై క్యా’. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. జులై 11న షూటింగ్ పూర్తికానుంది. ఆ వెంటనే ‘క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మణికర్ణిక’ ప్యాచ్ వర్క పూర్తి చేయనుంది. ఆ తర్వాత కంగనా కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనుంది. ఏ పాత్ర చేసిన దానికి వంద శాతం న్యాయం చేస్తుంది కంగనా. మరీ.. కబడ్డీ ప్లేయర్ గా కేకపుట్టిస్తుందేమో చూడాలి.