కంగనా జిమ్ కు ఎలా వెళ్తుందో చూడండి..

వివాదాస్పద నటి గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటి కంగనా రనౌత్..తెలుగులో ప్రభాస్ కు జోడిగా ‘ఏక్ నిరంజన్‌’ సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ ను అలరించింది. ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు మరో ఛాన్స్ తెలుగులో రాలేదు. కానీ హిందీ లో మాత్రం అమ్మడు వరుస సినిమాలు చేస్తూ పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. కేవలం సినిమాలతోనే కాదు వివాదాలతో కూడా అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ ‘మెంటల్ హై క్యా’ సినిమా చేస్తుంది.

జూలై 26న విడుద‌ల‌య్యేందుకు సిద్దంగా ఉంది. ఇక తాజాగా ఈ భామ జిమ్ పిక్స్ బయటకొచ్చి అందరి మతి పోగొడుతున్నాయి. ఎన్ని వివాదాలు వచ్చిన కానీ తన ఫిజిక్ విషయంలో మాత్రం చాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పటికిఅప్పుడు తన బాడీ ని మౌల్ చేసుకుంటూ అవకాశాలు రాబట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ జిమ్ పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.