కంగనా కిరాక్ పోజ్..

వివాదాస్పద నటి గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటి కంగనా రనౌత్..తెలుగులో ప్రభాస్ కు జోడిగా ‘ఏక్ నిరంజన్‌’ సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ ను అలరించింది. ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు మరో ఛాన్స్ తెలుగులో రాలేదు. కానీ హిందీ లో మాత్రం అమ్మడు వరుస సినిమాలు చేస్తూ పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. కేవలం సినిమాలతోనే కాదు వివాదాలతో ..సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది.

తాజాగా ఓ హాట్ పోజ్ లో దర్శనం ఇచ్చి అందరికి పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఈ పిక్స్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఎంత అందం ఎలా దాస్తున్నావ్ కంగనా…అంటూ వారి కోరికలు బయటపెడుతున్నారు. ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’ చిత్రం తో జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏక్తా కపూర్ నిర్మాతగా, ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో నటి కంగనా రనౌత్, నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన ప్రాతలుగా మెంటల్ హై క్యా చిత్రం తెరకెక్కింది.