దీపికా-రణ్ వీర్ పెళ్లి వార్త చెప్పిన కరణ్

ఈ యేడాదిలోనే బాలీవుడ్ ప్రేమజంట రణ్ వీర్-దీపికా పదుకొనెలు పెళ్లి చేసుకోబుతున్నారన్నది దాదాపు ఖాయమైంది. ఇన్నాళ్లు నవంబర్ 10న వీరి వివాహమని ప్రచారం జరిగింది. ఇప్పుడీ డేటు నవంబర్ 20కి మారినట్టు తెలిసింది. ఇటలీలోని కోమో సరస్సు దగ్గర వీరి వివాహాన్ని ప్లాన్ చేసుకొన్నారు. త్వరలోనే దీనిపై రణ్-దీప్ అధికారిక ప్రకటన చేయనున్నారని చెబుతున్నారు.

దీపికా-రణ్ వీర్ పెళ్లి వార్తలపై ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆసక్తికరంగా స్పందించారు. ఓ షోలో రేడియో జాకీగా అవతారమెత్తిన కరణ్‌ జోహార్‌కు రాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకోన్‌ల వివాహం త్వరలో జరగనుందనే వార్తలను అంగీకరిస్తారా, తోసిపుచ్చుతారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే వార్తను నిరాకరించనని స్పష్టం చేశారు. దీంతో.. దీపికా-రణ్ వీర్ లు పెళ్లి త్వరలోనే పెళ్లి జరగనుందని తేలిపోయిందని చెప్పుకొంటున్నారు.