katamarayudu first look
సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. సంక్రాంతి రేసులో ముందుగా మెగాస్టార్ చిరంజీవి దూకారు. మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’కి హిట్ టాక్ రావడంతో సంక్రాంతి సందడి డబుల్ అయ్యింది. రేపు బాలయ్య ‘శాతకర్ణి’ రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో.. ఈ సంక్రాంతి సందడి పీక్స్ చేరిపోవడం ఖాయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి వేళ అభిమానులని అలరించబోతున్నాడు.

పవన్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 14వ తేదీ రాత్రి 7 గంటలకి కాటమరాయుడు టీజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే కాటమరాయుడు ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ పై కాపీ మరక అంటింది. దీంతో.. టీజర్ తో చిత్రంపై అంచనాలు పెంచేందు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కాటమరాయుడు టీజర్ ని సూపర్భ్ గా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాటమరాయుడు’లో పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. శరత్ మరార్ నిర్మాత. అన్నట్టు.. కాటమరాయుడు మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

లేటెస్ట్ గాసిప్స్