‘కాటమరాయుడు’ క్రేజ్ పీక్స్ కి చేరిపోయింది. అందుకు తగ్గట్టుగానే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 95శాతం పైగా థియేటర్స్ కాటమరాయుడుతో... ‘కాటమరాయుడు’ థియేటర్స్ వివరాలు

katamarayudu trailler

‘కాటమరాయుడు’ క్రేజ్ పీక్స్ కి చేరిపోయింది. అందుకు తగ్గట్టుగానే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 95శాతం పైగా థియేటర్స్ కాటమరాయుడుతో నిండిపోనున్నాయి. సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న ఫస్ట్ క్రేజ్ సినిమా కావడంతో.. ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కి ముందు రోజు అంటే 23వ తేది అర్థరాత్రి నుంచి కాటమరాయుడు ప్రీమియర్ షోలు పడిపోనున్నాయి. పట్టణాలు, పల్లెల్లోనూ ప్రిమియర్ షోలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ సృష్టించడం ఖాయమంటున్నారు.

ఇక, కాటమరాయుడు కథని ఇప్పటికే స్వయంగా పవన్ కళ్యాణ్ రిలీవ్ చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఇందులో పవన్ కి 40యేళ్లు దాటిన పెళ్లి కాదు. అమ్మాయిలకి ఆయన ఆమడ దూరం. ఆయన ముగ్గురు తమ్ముళ్లు (అజయ్, కమల్ కామరాజు, శివ బాలాజీ)కి మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ముగ్గురు తమ్ముళ్లు కలసి అన్నయ్యని లైన్ లో పడేసేందుకు శృతిహాసన్ తో పరిచయం చేస్తారు. ఆ తర్వాత లవ్ స్టోరీ ఏంటన్నది తెరపై చూడాలి. ఈ చిత్రానికి దర్శకత్వం డాలీ. అనూప్ రూబెన్స్ సంగీతం. శరత్ మరార్ నిర్మాత.

లేటెస్ట్ గాసిప్స్