కీర్తి సురేష్ సినిమా వాయిదా

అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కథానాయిక కీర్తి సురేష్. ‘మహానటి’ సావిత్రి బయోపిక్ తో కీర్తి సురేష్ కీర్తి మరింతగా పెరిగింది. ఐతే, మహానటి తర్వాత కీర్తి సురేష్ మరో సినిమాలో నటించలేదు. ఇటీవలే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు నరేంద్ర దర్శకత్వం వహించనున్నారు. మహేష్‌ కోనేరు నిర్మించనున్నారు.

ఈ సినిమా ఇప్పటికే పూజాకార్యక్రమాలని జరుపుకొంది. ఈ నెల 14నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఐతే, ఇప్పుడీ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వాయిదా పడినట్టు సమాచారమ్. దానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. త్వరలోనే కొత్త డేటుని ప్రకటించబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది.

ఇదిలావుండగా.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించబోయే సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకొన్నారు. కీర్తి తో పాటు ఈ సినిమాలో మరో నలుగురు హీరోయిన్స్ నటించబోటున్నట్టు సమాచారమ్.