కీర్తి సురేష్.. పెరగలేదట !

రామ్ ‘నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయమైంది. అతి తక్కువ టైంలోనే ‘మహానటి’ అనిపించుకొంటోంది. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కు అశ్విన్‌ చెప్పిన కథ కన్నా, స్క్రీన్‌ప్లే బాగా నచ్చిందట. అందుకే సినిమాని ఓకే చేశానంటోంది.

ఈ సినిమా కోసం బరువు పెరిగాను అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నిజం చెప్పాలంటే సావిత్రి యంగ్‌ పాత్ర కోసం బరువు తగ్గాను. పెద్దయ్యాక కనిపించే పాత్రను మేకప్‌తో తీర్చిదిద్దారు. సమంత ఇందులో జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తుంది. ఆమె దృష్టి కోణం నుంచి ఈ సినిమా సాగుతుంది. ఇందులో నాటకీయత, సున్నిత హాస్యం, కంటతడి పెట్టించే విషాదం ఉంటాయని మహానటి విశేషాలు చెప్పుకొచ్చింది.