ఖైదీ నెం.150 బంపర్ హిట్

chiru-2
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ రిలీజ్ కి ముందే బంపర్ హిట్ అనే విషయం తేలిపోయింది. అదేలా.. ? ఎవరు డిసెడ్ చేశారు.. ?? ఇంకెవ్వరు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వి.వి వినాయక్ చెప్పారు.

‘ఖైదీ నెం.150’ ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత మెగాస్టార్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట. వెంటనే వినాయక్ ని దగ్గరుకి తీసుకొని గుండెలకి హద్దుకున్నాడట. అప్పుడు అర్థమయింది.. మెగా ఖైదీ బంపర్ హిట్టన్న విషయమని అని వినాయక్ చెప్పుకొచ్చారు.

మెగా ఖైదీలో చిరు డ్యాన్స్, డైలాగ్స్, పాటలకి మెగా అభిమానులు ఖుషి అయిపోవడం ఖాయమంటున్నాడు వినాయక్. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. లక్ష్మీరాయ్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత.

లేటెస్ట్ గాసిప్స్