khaidi
మెగాస్టార్ చిరంజీవి పోటీ నుంచి తప్పుకొన్నారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఖైదీ నెం.150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సినిమా హిట్ విషయాన్ని అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. దీంతో.. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ పీక్స్ చేరింది.

అభిమానుల మధ్య నెలకొన్న ఈ పోటీని తగ్గించే ప్రయత్నం చేశారు ఈ రెండు చిత్రాల దర్శక-నిర్మాతలు. రాంచరణ్, క్రిష్ కూడా రెండు చిత్రాలని ఆహ్వానిద్ధాం.. ఆస్వాదిద్దామని ప్రేక్షకులకి పిలుపునిచ్చారు. అయినా.. అభిమానుల మధ్య హీట్ ఏమాత్రం తగ్గలేదు. దీంతో.. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.

ఓ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ కి కూల్ చేసే కబుర్లు చెప్పాడు. బాలయ్య సినిమాతో తనకు పోటీ లేదు. బాలయ్య కూడా మంచి కథని ఎంచుకొన్నాడు. శాతకర్ణి ఓపెనింగ్ కి కూడా నేను వెళ్లాను. రెండు చిత్రాలు బాగా ఆడాలని ఆకాంక్షించారు చిరు. దీంతో.. మెగాస్టార్ పోటీ నుంచి తప్పుకున్నాడని సరదాగా చెప్పుకొంటున్నారు జనాలు.

ఇక, ఖైదీ నెం.150 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ మరికొద్దిసేపటిలో ప్రారంభం కానుంది.

లేటెస్ట్ గాసిప్స్